![]() |
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1070 లో..... ఇందు, రాజు కలిసి డిజైన్స్ వేస్తుంటారు. ఇందు వేసిన డిజైన్స్ చూసి రాజు నవ్వుకుంటాడు. అవి డిజైన్స్ అంటారా.. మీ అమ్మ బాగా డిజైన్స్ వేసేది.. అంటే నువ్వు కూడా వేస్తావనుకున్నాను.. నువ్వు ఆగు నేను ట్రై చేస్తానని రాజు అంటాడు. అప్పుడే అపర్ణ వచ్చి వాళ్ళు వేసిన డిజైన్స్ చూసి మీ మీద నమ్మకంతో కంపెనీని మీ చేతుల్లో పెట్టాను కానీ మీరు ఇలా చేస్తున్నారని అపర్ణ అంటుంది. నాకు డిజైన్స్ రాకపోవచ్చు కానీ ట్యాలెంట్ ని ఎంకరేజ్ చేస్తానని ఇందు అంటుంది.అప్పుడే శృతి కొన్ని డిజైన్స్ పంపిస్తుంది. అవి చూసి ఇంకా కొన్ని మిస్టేక్స్ చెప్తుంది నందు.
మరొకవైపు శృతికి రేఖ ఫోన్ చేసి డిజైన్స్ అయ్యాయా అని అడుగుతుంది. అయ్యాయి మేడం ఇందు మేడమ్ కి కూడా పంపానని అంటుంది. నచ్చాల్సింది క్లయింట్ కి అని రేఖ అనగానే తప్పకుండా నచ్చుతుందని శృతి చెప్తుంది. డిజైన్స్ లేట్ గా అవ్వాలి.. నువ్వు రేపు రాకూడదు నువ్వు అలా చేస్తే మీ అమ్మ హాస్పిటల్ ఖర్చు మొత్తం నేనే ఇస్తానని రేఖ అంటుంది. కంపెనీకి ద్రోహం చెయ్యలేనని శృతి చెప్తుంది. ఛాన్స్ ఇచ్చినప్పుడే తీసుకోవాలని రేఖ అంటుంది దాంతో శృతి సరే అంటుంది. ఆ తర్వాత రాజు బయటకు వచ్చి డాక్టర్ తో ఫోన్ మాట్లాడతాడు. డబ్బు కట్టేసాను.. డాక్టర్ ఇప్పుడు కండిషన్ ఎలా ఉందని అడుగుతాడు. మార్పు ఏం రాలేదని డాక్టర్ చెప్తాడు. రాజు ఫోన్ మాట్లాడి వెనక్కి తిరిగేసరికి ఇందు ఉంటుంది. ఎవరు హాస్పిటల్ లో ఉన్నారని అడుగుతుంది. అవన్నీ నీకు అవసరం లేదు.. నాకు ఒక్క హెల్ప్ చెయ్ టైమ్ కి డబ్బు ఇవ్వు చాలు అని రాజు చెప్తాడు. మరుసటి రోజు ఆఫీస్ లో హర్ష డిజైన్స్ కోసం వెయిట్ చేస్తాడు. శృతి ఇంకా రాలేదని రాజు, ఇందు టెన్షన్ పడుతారు. ఏంటి ఇంకా శృతి రాలేదని టెన్షన్ పడుతున్నారా అని రేఖ అడుగుతుంది.
రేఖ రౌడీలకి ఫోన్ చేసి శృతి ఇంటిముందే ఉండండి బయటకు రాకుండా చూడండి అని చెప్తుంది. శృతి గోడ పక్కనున్న రౌడీలపై చెత్త పడేస్తుంది . అయ్యో చూసుకోలేదు అండి.. మీరు నాకు ఒక హెల్ప్ చేస్తారా.. నిమ్మకాయలు తీసుకొని రండీ అని పంపిస్తుంది. వాళ్ళు నిమ్మకాయలు తీసుకొని వస్తారు. తరువాయి భాగంలో మీరు బిజినెస్ లో ప్రతీ దగ్గర జాగ్రత్తగా ఉండాలని ఇందు, రాజుకి సుభాష్ చెప్తాడు. ఆ తర్వాత ఇందు సంతోషంతో రాజుకి స్వీట్ తినిపిస్తుంది. తను కూడా అదే స్వీట్ తింటుంటే అది ఎంగిలి చేసానని రాజు అంటాడు. పర్లేదు అని ఇందు తింటుంది. అదంతా రేఖ చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |